![]() |
![]() |

ప్రస్తుతం గజిబిజి లైఫ్ లో ఎన్నో పనులు, మరెన్నో టెన్షన్ లు ఉంటున్నాయి. అందుకే ప్రతీ ఒక్కరికి సంగీతం వినాలని, అలాంటి సంగీతం వింటే కాస్త మనసుకి హాయి కలుగుతుంది. అలాంటి హాయినిచ్చే పాటల కోసం చిన్న సెలెబ్రిటీల నుండి పెద్ద సెలబ్రిటీల వరకు.. కామన్ మ్యాన్ నుండి గొప్పోళ్ళ వరకు అందరు కొన్ని పాటలని తమ ఫేవరెట్ పాటలుగా వింటుంటారు. అయితే కొందరు తమకిష్టమైన సంగీతాన్ని నేర్చుకుంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ ఆరోహి చేరింది.
ఆరోహి రావు.. బిగ్ బాస్ సీజన్-6 తో బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ కి ముందు వరకు ఒక న్యూస్ ఛానెల్ లో పనిచేసిన ఆరోహి .. తన యాస మాటలతో పాపులారిటి తెచ్చుకుంది. తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టింది అంజలి అలియాస్ ఆరోహి రావు. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్నా లేనట్టే అని చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే నాన్న తనని చిన్నప్పుడే వదిలిపెట్టాడని ఆరోహి రావు చెప్పుకొచ్చింది. వరంగల్ లోని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ఎంబిఏ వరకు చదివిన ఆరోహి.. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి ఒక న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. దాంతో తను క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అనాథగా అడుగుపెట్టిన ఆరోహి.. హౌస్ లోకి వచ్చాక అందరితో మాట్లాడుతూ సరదాగా గడిపింది. మొదట్లో కీర్తభట్ తో స్నేహంగా ఉన్న ఆరోహి, ఆ తర్వాత ఆర్జే సూర్య, ఇనయా సుల్తానాలతో కలిసి ఒక గ్రూప్ గా మారారు. హౌస్ లో కొన్నిరోజులు సూర్యతో లవ్ ట్రాక్ నడిపినట్లు కనిపించిన ఆరోహి.. అదంతా లవ్ కాదని వారిది స్నేహమే అని చాలాసార్లు చెప్పింది.

బిగ్ బాస్ తర్వాత తనకిష్టమైన యాంకరింగ్ రంగానికి మళ్ళీ వచ్చేసింది. ఇక రెగ్యులర్ గా ఇన్‌స్టా లో రీల్స్ చేస్తూ, ఫోటో షూట్ లతో రెచ్చిపోతుంది ఈ భామ. అయితే తాజాగా తను ఓ పాటని హమ్ చేస్తూ గిటార్ ప్లే చేయడం స్టార్ట్ చేసింది. తనకి నేయిల్స్ బాగా పెరిగాయని ముందు వీటిని తీసేయాలని లేదంటే ట్యూన్ సరిగ్గా రావడం లేదంటూ ఆరోహీ ఇబ్బంది పడుతుంది. ఇలా తను ఫస్ట్ ప్లే చేసిన గిటార్ మ్యూజిక్ ప్లేని ఇన్ స్టాగ్రామ్ అభిమానులతో పంచుకుంది. సరిగమపదని లతో పాటు తనకేం రావని.. రాగం, తాళం, పల్లవి, శృతి, లయ ఏం చెప్పొద్దని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది ఆరోహీ. అయితే ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తోంది.
![]() |
![]() |